Astrology

 

 

శివుని కి అబి షేకం వలన ఏం ఫలితములు

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.
కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .
రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .
భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .
గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
15 .
బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .
నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును 
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది  (మెత్తుట) పూజ చేయుదురు - అద్దిన  అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .
ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.
కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .
నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.
23 .
మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.


జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు:

జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...


    విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.
    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.
    ప్రకృతిలో... మాటకొస్తే విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్జాబ్స్చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.


Astroguide:

August 18
Sunday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana Shuddha Dwadasi till 4.56 pm
Star: Purvashadha till 6.35 pm
Varjaya: Till 7.38 am & 1.46 am to 3.12 am (on Sunday)
Durmuhurtam: 4.56 pm to 5.46 pm
Rahukalam: 4.30 pm to 6 pm
Sunset today: 6.40 pm
Sunrise tomorrow: 6 am
Aries:
Rely on your strong will and act positively in adverse situations. Frequent business trips will keep you occupied but you must take out time for family too. Exercise will help you reduce stress.
Taurus:
Resolving long-pending issues will give you peace. Brush up your technical knowledge for better career prospectives. A good news is on the cards.
Gemini:
Avoid setting unrealistic targets as this will only put you under pressure. Do not reveal confidential ideas to your colleagues as they might create obstacles.
Cancer:
Go through every document thoroughly before making any investment today. Teachers will have to work hard to make lessons innovative for students.
Leo:
Helping the needy will bring you joy. Family problems will be a cause of concern. You might meet your soulmate today. You will be asked to manage a big assignment at work. Colleagues will be of help.
Virgo:
You will have to put in extra number of hours at work today to wrap up your pending assignments. A healthy interaction with other colleagues would lead to useful exchange of ideas.
Libra:
You are likely to get the required training to enhance your career prospects. Domestic expenses are likely to rise. You will get fame and social recognition for your contribution towards society.
Scorpio:
Make sure you are focussed about achieving the required targets in business. People who are in search of a good career will get a good news soon.
Sagittarius:
Sagittarius: Your involvement in charitable events as a volunteer will bring you mental peace. A desire to do things differently will make you innovative.
Capricorn:
You will enjoy the company of your partner today. You might not agree with the views of your friends. Give their views a second thought.
Aquarius:
Your outstanding academic record will help you get the desired job. You will do something creative today to enthrall your partner. This would improve your bonding with him/her.
Pisces:
Do not trust information that you get from a third party. This could lead to misunderstandings with someone close. Financial success would largely depend on long-term strategic planning.




Astroguide

August  19   Monday, 2013

Sri Vijaya:  Dakshinayana
Thithi:  Sravana Shuddha Trayodasi till 1.39 pm
Star: Uttarashadha till 4.07 pm
Varjaya: 7.42 pm to 9.09 pm
Durmuhurtam:  12.45 pm to 1.35 pm & 3.15 pm to 4.05 pm
Rahukalam: 7.30 am to 9 am
Sunset today: 6.39 pm
Sunrise tomorrow: 6 am
Aries
You will get noticed for your creativity. You will have a satisfying day at work. Issues relating to family might be a cause of concern. Financial matters will require immediate attention.
Taurus
You will get monetary help to complete your pending projects. A development in your love life is on the cards. Health of someone close will require attention.
Gemini
You will get an opportunity to intern with an organisation. You might get betrayed by a friend. An auspicious function will require your participation.
Cancer
It is better to work in a team than to work alone. Success in recovering pending payments is likely. Take extra care to avoid minor accidents.
Leo
Wait for the right moment to give away your ideas and suggestions at work. Do not get involved in issues relating to others as you might end up in some trouble. Your health will need attention.
Virgo
Long-term business planning will be productive. You need to focus on the required targets and work towards it. It’s a good day for artists and students. Working professionals might go on a business trip.
Libra
You need to be updated with the latest technology in order to bag a job. Do not make any promises if you have no intentions to keep them. You will overcome delay in projects if you act in time.
Scorpio
Do not lose your temper at work. Someone at home will surprise you. You will get an opportunity to renew your friendship with an old foe.
Sagittarius
Don’t be in a rush to resolve sensitive issues as your emotions may drag you to take a decision that you would regret. Promotion is on the cards.
Capricorn
Your willingness to go an extra mile will be noticed by others. You need to be honest with your partner if you want the relationship to work out.
Aquarius
Your parents’ health might require attention. A family trip is likely to get postponed because of your work commitments. Today is going to be a busy day at work. Focus on your immediate goals.
Pisces
Your new project will require extra hardwork and dedication from your side. A new opportunity might knock at your doorstep soon. Do not be in a hurry to expand your business.

Astroguide

August 21
Wednesday, 2013
Sri Vijaya : Dakshinayana
Thithi: Sravana Shuddha Purnima till 7.15 am & Bahula Padyami till 4.28 am(on Thursday)
Star: Dhanistha till 11.25 am
Varjaya: 6.03 pm to 7.32 pm
Durmuhurtam: 11.53 am to 12.44 pm
Rahukalam: 12 noon to 1.30 pm
Sunset today: 6.38 pm
Sunrise tomorrow: 6.01 am
Aries
You might associate yourself with an organisation where professional growth is fast. Avoid confrontation with your partner. On health front take preventive medication, if necessary.
Taurus
Financial situation is likely to improve. Don’t neglect yourself on health matters. Listen to your inner feelings before promising anything at work.
Gemini
Avoid complacency at work. Past investments even in dubious firms will bring unexpected results. You will have to be a little careful in your romantic affairs.
Cancer
Take part in activities that will make you feel good about yourself. You will make new contacts at clubs or parties. Don’t get involved in office gossip.
Leo
If you have some tension with your friend or beloved, then discuss it face to face. It would be the small things in life which give you a lot of joy. You may face problems at your workplace.
Virgo
You may get over-strained from work and a lack of sleep may affect your health and stamina. Ego problems might occur within your friends circle. There could be an unexpected rise in expenses.
Libra
Stick to normal routine jobs only. Today is not a favourable situation for earning money or involving speculative activities. Don’t sign any important documents blindly.
Scorpio
Prepare yourself to face intense competition. Family relations would be smooth. Love life would blossom provided you pay heed to it.
Sagittarius
Devote time in reassessing strengths and discussing future plans with close friends. You make an investment in luxurious vehicles like a car or van.
Capricorn
You may feel tired and lazy at work. New contacts will prove to be beneficial. You may also succeed in resolving scores of domestic issues.
Aquarius
You will certainly emerge victorious in some legal disputes. Hard work should bring money and fame. You may receive some unpleasant news which may make you upset.
Pisces
Today you will receive remarkable results if you concentrate on work. Try not to force others to do things that you wouldn’t do. Emotional support will see you through a tiring day.




Astroguide:

August  23

Friday, 2013

Sri Vijaya: Dakshinayana
Thithi:  Sravana Bahula Tadiya till 12.40 am (on Friday)
Star:  Purvabhadra till 8.12 am
Varjaya:  5.32 pm to 7.06 pm
Durmuhurtam: 8.34 am to 9.24 am & 12.43 pm to 1.33 pm
Rahukalam: 10.30 am to 12.00 pm
Sunset today:  6.37 pm
Sunrise tomorrow: 6.01 am

Aries
Take advice from experts to make better use of money. You need to be honest with your partner if you want the relationship to work out. Do not worry about health.
Taurus
You will be successful in acquiring new skills to discover more about yourself. Take advantage of your experience and communication skills.
Gemini
Health will depend on your response to tough situations. Family front seems to be very smooth today. Pay heed to advice from family and friends.
Cancer
Keep your investments as a secret from friends. Your partner will be supportive and will help you resolve issues. Spend some time with relatives.
Leo
Situations would demand a change in daily schedule. You may succeed in making new friends. Make sure you invest money in safe funds to bring low but steady returns.
Virgo
Pay attention to your skills at work to avoid professional problems. The company of family members will bring relief, comfort and joy. Spend time with those who let you harness your full potential.
Libra
Do not be arrogant with your partner. Resolve issues at the earliest. You are likely to make some changes in daily routine to bring enthusiasm back in life. Do not depend on friends for any help.
Scorpio
An auspicious day for family functions and important ceremonies. Make sure to spend quality time with your partner. Keep away from quarrels with relatives.
Sagittarius
Romantic vibrations from someone unknown would lift your spirits. Negative thinking and egoistic behaviour may adversely affect your health.
Capricorn
It is your day of success. Legal issues related to land will be resolved. Love life will blossom. You will be successful in using your talents to the fullest.
Aquarius
New romance would take worries off your mind. Avoid losing temper at all costs. You will have to guide and help subordinates to enable them to regain their lost motivation and confidence.
Pisces
Legal problems will be solved with the help of friends. If possible share the company of close relatives who understand your feelings and needs. Laughter medicine would boost immune system.


Sankashti Chaturthi on 24st August 2013(Saturday):

Lord Ganesha, the remover of obstacles is worshipped every month on Chaturthi thithi of Krishna Paksha. Devotees break their fast after sighting Moon. Due to unpredictable weather, chances of sighting moon may be not possible. In such situations, one can break their fast by verifying the Moon-rise timings as per Panchang. Some staunch devotees break their fast the next day (morning), after offering prayers to Ganesha.

Offering Argya (Oblation with Water, Chandan and flowers) to Moonis a part of Sankashti Vrata.



 Sankashti rules in English:

1. One must observe vrat on Chaturthi thithi of Krishna Paksha.
2. Generally devotees begin this vrat on Shravana Bahula Chaviti, take early morning bath, chant stotras on Ganesha like Sankashtahara Ganesha stotra. "Shree Namo Herambha Mama Sankashtam Nivaraya Nivaraya" a powerful prayer request to Ganesha is also chanted for twenty-one(21) times. Those who do not observe the vrat can also chant this prayer request. It is a good practise to chant this short phrase whenever possible. It does wonders!

3. This vrata helps in getting rid of all kinds of calamities, health problems, fear, graha doshas (adversities due to improper alignment of planets in one's horoscope).

4. One must observe Upavasa during morning. Pregnant women, aged persons and those who are on medication or taking medical treatments are exempted from keeping fast.

5. In the evening, Ganesha should be worshipped with twenty-one( 21) fresh grass-blades and flowers. Abhishekam can also be performed. A special food offering called modak (sweet dumplings made of wheat flour, coconut and jaggery) is to be offered. Those who cannot prepare modak, can offer a small piece of Jaggery, roasted dal, poha (beaten rice) and fruits. It is Bhakti-True love for God that does count, not the number of food items offered.

6. Gigantic Swallow wort flowers , Fresh grass-blades(Garika), Hibiscus flowers and Bilva Leaves are sacred in Ganesha's worship.

7. Generally the vrat is observed for 21 months (#21 is auspicious for Ganesha). Some devotees observe vrat for six(6) months or a Year. After completion of designated months, conclude the vrata withUdyapan by sponsoring or performing Ganesha homa, Give away 21 modaks to a Vedic Scholar. (Udyapana is a must).

8. Devotees also chant Shree Ganeshaya Namaha or Aum(Om) Ganeshaya Namaha 108 times. To chant Ashtakshari mantra japa, one must compulsorily need to take initiation from a Guru.


శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు:

1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)
షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
2.శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886
3.మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918 (బూటి వాడా)

 శిరిడీలో దర్శనీయ స్థలాలు:

1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3.ద్వారకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా)
12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా)
చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన), మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), తాత్యాకోతే పాటిల్ సమాధి, అయ్యర్ సమాధి, అబ్ధుల్ బాబా సమాధి, నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), అమీదాస్ భవాని మెహతా గారి సమాధి, ముక్తరాం గారి సమాధి(దత్త మందిరం వెనుక).

బాబాగారు బిక్ష గ్రహించిన ఇళ్లు:

1.సఖరామ్ పాటిల్
2.వామనరావ్ గోండ్ఖర్
(వీరిరువురి ఇళ్లు చావడికి దగ్గరలో ఇప్పుడు వెన్నెల హోటల్ ఉన్న దగ్గర ఎదురెదురుగా ఉండేవి)
3.బయ్యాజి అప్పాకోతే పాటిల్
4.బాయిజాబాయి గణపతికోతే పాటిల్
(వీరిరువురి ఇళ్లు వెన్నెల హోటల్ దాటగానే ఎడమచేతివైపు ఉన్న వీధిలోకి ప్రవేశించి 20 అడుగులు వేయగానే తులసి కోట లాంటి దానిపై పాదుకలు ముద్రించి ఉంటాయి - -పక్కపక్క ఇళ్లు)
5.నందరామ్ మార్వాడీ సంఖ్లేచా.
(ద్వారకామాయి దగ్గర)

భక్తులు:

1.మహల్సాపతి.(వీరి సమాధి తాజింఖాన్ బాబాగారి దర్గా దగ్గర ఉంది)
2.చాంద్ పాటిల్
3.తత్యాకోతే పాటిల్
4.మాధవరావ్ దేశ్ పాండే /శ్యామా
5.నానా సాహెబ్ చందోర్కర్.
6.అన్నా సాహెబ్ దబోల్కర్ /హేమాడ్ పంత్
7.దాసగణు మహరాజ్
8.ఉపాసని బాబా
9.లక్ష్మీబాయి షిండే(ద్వారకామాయి ఎదురుసందులో 30 అడుగుల దూరంలో ఎడమచేతి వైపు)
10.అన్నాసాహెభ్ దభోల్కర్
11.భాగోజీ
12.కాకా సాహెబ్ దీక్షిత్ / హరి సీతారాం
13.దాదా సాహెబ్ ఖాపర్డే
14.అబ్ధుల్లా జాన్
15.బూటీ
16.బడే బాబా



Astroguide

August  25
Sunday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi:  Sravana Bahula Panchami till 11.50 pm
Star:  Revathi till 7.41 am
Varjaya: 4.29 am on Monday
Durmuhurtam: 4.52 pm to 5.42 pm
Rahukalam: 4.30 pm to 6 pm
Sunset today: 6.35 pm
Sunrise tomorrow: 6.01 am

Aries
A short pleasure trip with family will help to regain lost trust. Don’t forget to speak to the backbiter in a group to make him/her conscious of mistakes. Proper sleep will be required.

Taurus
Careful planning will bring desired professional results. The day brings a sudden inflow of funds from commissions, dividends and royalties.

Gemini
Be very careful while signing financial documents. A romantic encounter will spice up your life. Your innovative style will come as a pleasant relief to people.

Cancer
Unexpected expenses might give financial pressure. You will be required to put an extra effort to make your relationship work with your partner.

Leo
Monotonous life might hit you. It is high time you be creative at work. Valuing your juniors’ integrity will motivate them to work hard. Time to reduce your hectic schedule to enjoy life.

Virgo
Romantic thoughts will occupy your mind. A preventive care will keep you from illness. Don’t indulge in backbiting to please seniors at work. You will have to make arrangements to repay debt.

Libra
Mental happiness is the tonic for physical health. You will increase your contacts with intellectuals. If you are too generous in financial matters, you will be taken for a ride.

Scorpio
Taking some calculated risks in financial matters will get profits. Travelling might give you a new romance. Migraine patients should care about their diet.

Sagittarius
Performing auspicious ceremonies at home will prove beneficial. To maintain a good financial position, careful steps should be taken.

Capricorn
You will receive assistance from family members to finish your pending jobs. You should concentrate on your childrens’ studies as they need attention.

Aquarius
Excellent day for thinking about your career options. You are likely to find it easy to resolve differences and strengthen ties. Keep your views to yourself.

Pisces
Meetings will go off well and it will be easy when communicating your views. Be diplomatic and accommodative in your interactions at work. Hectic travel is indicated.


మాతా అన్నపూర్ణేశ్వరీ:
'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది.

ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండటం వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు, బ్రహ్మ తలల్లో ఒక తలను ఖండించగా, బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంది. ఆ హత్యాదోషం పరమశివుని కడుపులో ఆకలిమంటగా రూపుదాల్చింది. ఆకలి బాధను తీర్చుకునేందుకై పరమశివుడు కపాల భిక్షాపాత్రను పట్టుకుని యాచిస్తూండేవాడు. ఆ భిక్షపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా, ఆ భిక్షాపాత్ర నిండాలన్నది విధి. అందుకై ఆదిశక్తి అన్నపూర్ణ అవతారాన్ని ధరించింది. ఆదిభిక్షువు పాత్రను అన్నంతో నింపింది. ఫలితంగా స్వామిని పట్టుకున్న బ్రహ్మహత్యాదోషం వెనక్కి తగ్గింది.

మరి, ఆ తల్లి వారణాశికి వచ్చిన కథ సంగతి ఏమిటి? ఈశ్వరునికి ప్రియాతిప్రియమైన కాశీ నగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే ఇద్దరు సోదరులున్నారు. దేవదత్తుడు అష్టైశ్వార్యాలతో తులతూగుతూండగా, ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో సతమతమవుతుండేవాడు. ఒక రోజు ధనుంజయుడు మణికర్ణికా స్నానఘట్టంలో ముఖ ప్రక్షాళన చేసుకుని, కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుని, తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో, ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మంటపంలో కూర్చున్నాడు. 'నేను ఇలా ఆకలిదప్పులతో అలమటించడానికి కారణమేమిటి? నేను గతజన్మలో ఎవరికి అన్యాయం చేసాను? అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో అతనికొక కల. ఆ కలలో సన్యాసి గోచరించి ఇలా చెప్పాడు. 'దరిద్ర ధనుంజయా! పూర్వకాలంలో కంచిలో శత్రు మర్దనుడనే రాజకుమారుడుండేవాడు. అతనికి హేరంబుడు అనే ప్రియ మిత్రుడూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేటకెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోయారు. అలా తిరిగి తిరిగీ సూర్యాస్తమయ సమయానికి ఓ మునీశ్వరుని దర్శించుకున్నారు. ఆ మునీశ్వరుడు మిత్రులిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి మంచి నీళ్లిచ్చి, ఆకలి మంటలు చల్లారేందుకు పాలలో ఉడికించిన బియ్యపుపిండి ఫలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతూన్న శత్రుమర్దన రాజ కుమారునికి ఆ పదార్థం అమృతంలా తోచింది. ఒక్క చుక్క మిగల్చకుండా అంతా తాగేశాడు. అతని మిత్రుడు హేరంబునికి ఆ పదార్థం నచ్చక పోవడంతో కొంచెం తాగి, మిగతా వదిలేశాడు. అలా అన్నాన్ని అవమానపరిచి నందుకు హేరంబునిగా ఉన్న నీవు, ఈ జన్మలో దరిద్ర ధనుంజయునిగా జన్మించావు.

రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తునిగా జన్మించి సకల భోగాలను అనుభవిస్తున్నాడు. అన్నాన్ని అవమాన పరిచినందుకుగాను నిన్ను అన్నదోషం వెంటాడుతోంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరీదేవిని శరణు వేడుకో. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని అనుసరించి, నీ దరిద్రాన్ని దూరం చేసుకో" అని చెప్పి సన్యాసి అంతర్థానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనుంజయండికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో తెలియదు. అప్పట్నుంచి కనబడినవారినంతా అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలని అడుగసాగాడు. అలా అర్థిస్తూ, అర్థిస్తూ కామరూపదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కోండప్రక్కన కోంతమంది దేవకన్యలు ఏదో పూజను చేస్తూండడం అతని కంట్లో పడింది. వారి దగ్గరకెళ్లి ఎవరిని పూజిస్తున్నారని అడిగిన ధనుంజయునికి, అన్నపూర్ణేశ్వరీదేవిని పూజిస్తున్నామన్న జవాబు లభించింది. అతని సంతోషానికి ఎల్లలు లేవు. ధనుంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగివచ్చిన ధనుంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరీ వ్రతాన్ని చేసి, ఆ తల్లిని పూజించి, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రమయ్యాడు. దరిద్రబాధలను అనుభవించిన ధనుంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు.

ధనవంతుడవగానే ధనుంజయుని కామపిశాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒక రోజు పెద్ద భార్యతో కూర్చుని అన్నపూర్ణ వ్రతాన్ని ముగించిన ధనుంజయుడు చేతికి వ్రత దారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు. నన్ను వెళ్లగొట్టేందుకు నీ పెళ్ళాం ఈ దారాన్ని కట్టిందా? అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండవ భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనుంజయుడు నోముతాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి, భయపడి మరొక తాడును కట్టుకున్నాడు.

కానీ, జరగాల్సినదంతా జరిగిపోయింది. అన్నపూర్ణకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనుంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, అతనికి అన్నపూర్ణ కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూప దేశానికి పరుగెత్తాడు. తనకు అన్నపూర్ణవ్రతం బోధించిన చోట దృశ్యన్ని చూసి, అతనికి ఆశ్చర్యమనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంపై విరక్తి చెందిన ధనుంజయండు కళ్ళు మూసుకుని ఆ బావిలో దూకాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనుంజయుడు చనిపోలేదు.

ఒక్కసారిగా బావిలోపల కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఓ అద్భుత దృశ్యం అతని కంటబడింది. అక్కడొక కొలను. ఆ కొలను పక్కన పూజలో నిమగ్నమైన దేవతలు. ఎటుచూసినా వేదఘోషలు. చెవులకింపైన సంగీతం. అక్కడ స్ఫటిక శరీరాకృతితో ఓ పురుషుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఆతని కొప్పులో నెలవంక. నుదుట మూడు కన్నులు. ఆ శరీరమంతా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతోంది. ఆయనకు ఎదురుగా ఓ రత్న సంహాసనంపై ఓ మాత కుర్చుని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తోంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనుంజయుని చూసి అతడిని గెంటి వేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడా మాత వారిని వారించింది. ఆమె ధనుంజయుని దగ్గరకు పిలిచి, "నువ్వు ఇన్నాళ్ళూ ఏ అన్నపూర్ణేశ్వరీ దేవిని చూడాలనుకుంటున్నావో, ఆ అన్నపూర్ణేశ్వరీ దేవిని నేను. రుద్రుని రుద్రతాండవాన్ని చూసేందుకై ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడ దక్కని అవకాశం" అని చెప్పింది.

అప్పుడు ధనుంజయుడు భక్తి పారవశ్యంతో, "మాతా! మీ ఇద్దరి దర్శనభాగ్యంతో నా జన్మ తరించింది" అని పలికాడు. అన్నపూర్ణేశ్వరీ దేవి చిరునవ్వులు చిందిస్తూ, "ధనుంజయా! ఇకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో, వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో, ఆ ఇంట్లో నేను వచ్చి కొలువుంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి, మరలా వ్రతాన్ని ప్రారంభించు. నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేను భూలోకవాసుల కోసం కాశీ నగరానికే వస్తున్నాను. నా కోసం నువ్వొక ఆలయాన్ని నిర్మించు" అని ఆనతిచ్చింది. ధనుంజయుడు అమ్మవారి ఆనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే కాశీ అన్నపూర్ణేశ్వరాలయం.

నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకలజీవరాసులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది స్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆ ఆదినాధుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీఅన్నపూర్ణా అని పిలుస్తారు. దసరా పండుగ సందర్భాలలో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడ చేస్తుంటారు. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం ఏమిటి అని అడిగితే, ఈ అన్నపూర్ణదేవి కూడా అమ్మవారి దివ్యస్వరూపాల్లో ఒక రూపమే. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణా ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది. ఇదీ అలంకారంలోని దృశ్యం. దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమంటే, తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపునిండా తీండిపెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎంతకష్టాన్నైనా పడుతుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి, వారి ఆకలిని తీరుస్తోంది. అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది. అంటే ఈ లోకంలో అ అన్నార్తులైన వారినందరినీ సాక్షాత్తు శివ స్వరూపులుగా మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిస్వరూపమే అవుతాం. ఆ న్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకంలో ఆకలిని తీర్చడం కన్నామిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకూ అన్నార్తులు అలమటించి పోకుండా కాపాడాలి. ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థించుకోవలెను. ఆ తల్లి భక్తాభీష్టప్రదాయిని. మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి.

వరాహస్వామి:

                                

తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామివారికే అందుతాయి. ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు. హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరివేస్తాడు. ఆ భూమాతను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి కోపం తెచ్చుకోకుండా ఆవేశ పడకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకొని సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు. 

ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే నని ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా వరాహస్వామి దర్శనం అవుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు.

భాగ్యశాలినులైన గోపికలు:

భాగ్యశాలినులైన గోపికలఅదృష్టమును వర్ణించుటకు మాటలుచాలవు. మనస్సు ఊహింపజాలదు, బుద్ధికి శక్తిచాలదు. శ్రీకృష్ణపరమాత్మ యొక్క లీలాశరీరము, ఆయన లీలలు ప్రాకృతములు గావు, దివ్యములు. అట్లే ఆస్వామిపై గోపికలకుగల ప్రేమయు అలౌకికమే. గోపికలలో పెక్కుమంది పూర్వజన్మలో తాముచేసిన తపస్సాధన ఫలితముగా తాము కోరుకొనిన విధముగ భగవంతుని సేవలు చేయుటకై ఈజన్మలో ఇట్లు అవతరించిరి. వారి ప్రేమలు సాటిలేనివి, వారి అనుబంధము విడదీయరానిది. గోపికల ఇండ్లలో వెన్నెలను దొంగలించుట, వారి వస్త్రములను అపహరించుట, వారితో రాసక్రీడలుసలుపుట మొదలగు లీలలను అన్నింటిని ప్రేమ స్వరూపుడైన భగవంతుడు వారిని ఆనందింపజేయడానికే ప్రదర్శించెను. గోపికలు కొందఱు పూర్వజన్మలో దేవకన్యలు, మఱికొందఱు వేదస్వరూపులు, ఇంకను కొందఱు తాపసులైన ఋషులు. అతడు వారికి ప్రాణతుల్యుడు.


గోపికల యొక్క మనస్సులు, తనువు, సంపదలు అన్నియును శ్రీకృష్ణునివే. వారి లౌకికజీవనము అంతయును శ్రీకృష్ణునిపరమైనదే. వారు గృహకృత్యములు ఏవి ఆచరించుచున్నను వారి మనస్సులు మాత్రము కృష్ణధ్యాసతోడనే నిండియుండును. వారు రాత్రియంతయు మేల్కొని, తెల్లవాఱెడి వరకు కృష్ణునే స్మరించుచుందురు. ప్రాతఃకాలమున పెరుగును చిలికి, వెన్నలనుదీసి, ఉట్లపైనుంచి, వారు ఆ స్వామికొరకు ఎదురుచూచుచుండెడివారు. శ్రీకృష్ణు నిదర్శనము అయ్యెడి వరకు వారికి ప్రతిక్షణము ఒక్కొక్క యుగముగా కనిపించుచుండెడిది. కృష్ణప్రభువు వారిని సంబరప పరుచుటకే వారి యిండ్లకు వెళ్లినాడు. వెన్నెలను దొంగలించి తినుచుండెడివాడు. వాస్తవముగా అది దొంగలించుటకానే కాదు. భక్తవత్సలుడైన భగవానుడు ఈ విధముగా పూజలను స్వీకరించి, వారిని ఆనందింపజేసెడివాడు.

గోపికలు శ్రీకృష్ణునికి ఊపిరి. వారు మనస్సులలో శ్రీకృష్ణుని తమపతిగా పొందవలెనని అభిలాషపడుచుందురు. వారు ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను జేసి, వివిధములగు ఉపచారములతో పూజించుచు ఇట్లు ప్రార్థించుచుచుండెడివారు. "మాతా! నందనందనుని మాకు పతిగాచేయుము. మేము నీకు ప్రణమిల్లెదము." చివరకు దేవి అనుగ్రహముతో వారిసాధన ఫలించెను. శరత్పూర్ణిమనాటి వెన్నెలరాత్రి యందు కృష్ణస్వామితో రాసక్రీడలు సలుపు అవకాశము వారికి లభించెను. ఆ లీలాకృష్ణుని పిల్లనగ్రోవి ప్రతిగోపికను పేరు పేరునను పిలుచుచుండెను. గోపికల మనస్సులు కృష్ణునియొద్దనే యుండినవి. అపుడు వారిశరీరములుగూడ ఆ మురళీనాదమువెంట పరుగెత్తినవి. ఆ మురళీస్వరము వినబడినంతనే వారు ఉన్నవారు ఉన్నట్లుగా పరుగులు పెట్టిరి. మురళీరవము ఆకర్షింపగా సుందరీమణులైన గోపికలు అందఱును గుముగూడిరి. మొదట జరిగిన కఠినమైన ప్రేమ పరీక్షలో వారు నెగ్గిరి. గోపికలు తమ ప్రేమధనముతో విశ్వాత్ముడైన కృష్ణుని కొనివేసిరి. వారు ఆ స్వామిని హృదయపూర్వకముగా ఆలింగనమొనర్చుకొని, ధన్యులైరి. రాసలీలలతో వారిమనోరథములు సిద్ధించెను.

హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఒకనాడు మథురకు వెళ్లెను. తమప్రియతముని విరహకారణముగా గోపికల ప్రాణములు ఆయనవెంటనే యుండెను. బృందావనములో వారి చాయలు (శరీరములు) మాత్రము ఉండెను. కొన్ని దినముల పిదప ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును దీసికొనివచ్చెను. కాని ఆయనయు శ్రీకృష్ణనియెడ గోపికల ప్రేమసాగరములో మునిగిపోయెను. వాస్తవముగా శ్రీకృష్ణుని యెడబాటు అనెడి లీల వారి ప్రేమకు పుష్టిని ఒసగుటకే జరిగినది. ఈ లీల జరుగకున్నచో 'భగవంతుడు ప్రేమకు అధీనుడు' అనెడిసత్యము వెల్లడియై యుండెడెది గాదు. కురుక్షేత్రయుద్ధ భూమియందు వారు శ్రీకృష్ణుని మఱల కలిసికొనిరి. తమ ప్రియతముని చూచినంతనే వారివిరహాగ్ని చల్లారెను. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలావతారమును చాలించుసమయము ఆసన్నమాయెను. అప్పుడు ఆ గోలోకవిహారితో పాటూ గోపికలుగూడ అంతర్హితులైరి.
తులసి:

శ్రవణే చ, వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,
పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!

ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.




Astroguide:

August 26

Monday, 2013
Sri Vijaya:  Vijaya: Dakshinayana
Thithi: Sravana Bahula Shasthi till 11.37 pm
Star: Ashwini till 8.39 am
Varjaya: Sesha Varjyam up to 6.09 am & 6.56 pm to 8.39 pm
Durmuhurtam: 12.42 pm to 1.32 pm & 3.12 pm to 4.02 pm
Rahukalam: 7.30 am to 9 am
Sunset today: Today 6.34 pm
Sunrise tomorrow: Tomorrow 6.01 am

Aries
You will leave an impression on whosoever you meet. Finances need attention. Pending issues will be resolved. Commitments will keep you busy. Don’t neglect domestic obligations. You may be contemplative about a certain personal issue. Interestingavenues could give you an opportunity to display your leadership.
Taurus
You may take up a self-improvement project to broaden your horizons. Planning a schedule will make you minimise the interruptions or delays. Don’t hesitate to take tough decisions if you feel the need to curtail your investments in projects. New opportunities could come your way through close associates. You will find innovative ways to deal with complicated issues at work.
Gemini
You will be able to reach an agreement on important issues. Decide whether teamwork or working independently will be better today and proceed accordingly. Family issues may be taking up your time. You can avoid tensions by patiently hearing out loved ones and being diplomatic when expressing your views.
Cancer
You need to focus on your fiscal security. Get a good opinion for new financial decisions. You’ll be asked to take part in an important project at work. Be patient as your worries are baseless. It is likely to be a busy but productive day. You may be determined to make some tough decisions regarding certain personal or financial commitments.
Leo
You may be overwhelmed about new aspects of a certain task. Avoid getting caught up in conflicts. You may be upset about certain things. Don’t repress your feelings, discuss issues with loved ones. Rely on your own judgment, people may be making promises right now just to get you on board and may not have the ability to deliver.
Virgo
Don’t neglect your family or social obligations. Take a break to rejuvenate yourself. You will get more work done on the professional front if you build a consensus with colleagues. You may also have to work harder to convince people about your ideas. Don't cheat on your fitness regime. Make a backup of your important information.
Libra
You will create a good impression in business meetings. Refrain from making expensive purchases that are not needed. You may be temporarily overwhelmed by a particular situation. The best way forward is to turn to close associates for clarity instead of getting defensive and trying to find the solution on your own.
Scorpio
Sudden insights can lead to a breakthrough with complicated assignments. Some of you may be determined to join a charitable organisation. Prioritizing your love life will lead to happy moments. You need to work on implementing health enhancing measures. Your in-depth knowledge and skills will be recognized and appreciated.
Sagittarius
Some of you could make good progress at work. New opportunities may come your way. You will create the right balance between family and career commitments as you seek to play a greater role at home. Taking the time to explain what you expect out of your love life and listening to what your partner's expectations are will ease recent misconceptions.
Capricorn
Some of you will explore the spiritual aspect of your being. Colleagues and seniors will be supportive. You will gain through investment or property. This is an excellent time to tweak your fitness regimes to get the most out of them. Compromise and accommodation will ensure that things get done on time.
Aquarius
Don’t take on new commitments unless you are sure of the result. Be supportive and give loved ones space if they don’t want to share their problems.
Pisces
Be open to changes to infuse excitement which will help you get out off the rut that you have been in lately. Be discreet with information that you come across.
వినాయక చవితి వ్రతము :
 గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.

ఓం గం గణపతయే నమః


సత్పురుషుల సహవాసం చేయండి - శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుండి

ఆదిశంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం. ఒక కాలంలో మనదేశంలో ధర్మం క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతారం చేయడం జరిగింది. ఆయన కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే సకల వేద శాస్త్రములను ఆపోశన పట్టారు.ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. పదహారు సంవత్సరముల లోపల అనేక గ్రంధాలను వ్రాశారు. 32 వయస్సులో యావద్భారతంలోనూ మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు. అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి ఆయన కృషి చేశారు.

ఆయన ఒక చోట ఇలా చెప్పారు- "నాయనలారా! మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి.
"మా కురు ధన జన యౌవన గర్వం" మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె తప్పుడు పనులు చేస్తాడు. సీతాపహరణమనే మహాపరాధం చేశాడు. ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.
తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!
ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.

నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు. ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు. "నేయం సజ్జన సంగే చిత్తం" అన్నారు భగవత్పాదులు. "గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని జపించు. ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి. మన జీవితంలో సమయం అమూల్యమైనది. సమయం పొతే తిరిగిరాదు. సమయాన్ని వ్యర్ధం చేయకు. మానవ జన్మ అపురూపమైనది. ధర్మానుష్టానానికి అనువైన జన్మ. దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు. వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు. నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు. ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.
" ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి. తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి. కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు. నీకు నీవు మిత్రుడివి కా. సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు. ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది. ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి. తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం. ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు. వాటిని మనం మననం చేయాలి. అదేవిధంగా ఆచరణ చేయాలి. ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు. ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు.ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు.



Astroguide:
August 28

Wednesday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana Bahula Ashtami till 4.10 am (on Thursday)
Star: Krittika till 12.42 pm
Varjaya: Nil
Durmuhurtam: 11.52 am to 12.42 pm
Rahukalam: 12 noon to 1.30 pm
Sunset today: 6.33 pm
Sunrise tomorrow: 6.02 am

Aries
Good day for planning new projects and sharing ideas. Your parents will be proud of your capabilities. This is the time to do well professionally and to show others your immense capabilities.
Taurus
Business partnerships will be good. There may be potential for a new business venture if you do your ground work with the right investment sources.
Gemini
Work will be hectic. You need to be flexible to accommodate last-minute changes. Love affairs could tense up if you don’t give time to your partner.
Cancer
A diplomatic approach will keep sceptics away and your colleagues will back your ideas. Being eager and attending seminars will strengthen base at work.
Leo
No good will come of arguing. Projects related to higher authorities are in bureaucratic wrangling. An act of courage will be rewarded. You may go dancing tonight; bring that sparkle to your life.
Virgo
You will make monetary gains and earn a good professional reputation. A minor health problem might begin to surface. You might get into in an extra marital relation so stay away from temptation.
Libra
The bitter experiences of the past few days will fade away soon. Romance will be smooth after some initial glitches Objectively analyse issues that are affecting your love life.
Scorpio
You need to create a balance between home and work to have mental and physical stability. Legal issues could move forward and fetch good results.
Sagittarius
New romantic involvement will add spice to your life. Get involved in new things that will help you in making some new friends.
Capricorn
Don’t get into arguments with your friend or partner. You must control your emotions to avoid tension. Do not get into signing long-term contracts.
Aquarius
Your financial position should improve towards the later part of the day. This is also a good day make a fresh move in new romantic relations. Social gathering will not be as exciting as expected.
Pisces
The chances for romance are bright. Close associates and loved ones will be supportive. New ideas will need to be worked on before you share them with others.


 జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు:
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది.

పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమశివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు.

అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని "నమశ్శివాయ" అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు.

ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. శ్రీ కృష్ణ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు.

అప్పుడు కృష్ణుడు తాను ఓ 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు.

తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.

ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి.

తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి.

తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి.

వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.

"నమశ్శివాయ" మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి.

అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది.

లోకకళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..

దశ (10) దానాలు :
1.గోదానం (= ఆవులను దానం ఇవ్వడం)
2.భూదానం, (= భూమిని దానంగా ఇవ్వడం)
3.తిల దానం, (= నువ్వుల దానం)
4.హిరణ్యదానం, (బంగారం దానం)
5.ఆజ్య దానం, (= నెయ్యి దానం)
6.వస్త్ర దానం, (= దుస్తుల దానం)
7.ధాన్య దానం, (= ధాన్యం దానం)
8.గుడ దానం, (= బెల్లం దానం)
9.రౌప్య దానం (= రౌప్యం అంటే రూప్యం. అంటే బంగారు లేదా వెండితో చేసిన నాణ్యం. స్థూలంగా దీన్ని ధనదానం అనవచ్చు)
10.లవణ దానం (= ఉప్పు దానం) (లవణాలు మళ్లీ మూడు రకాలు)

త్రిలవణాలు :
1. సైంధవ లవణం
దీన్ని ఇందుప్పు అని అంటారు. ఇందుడు అంటే చంద్రుడు అని అర్థం. అంటే చంద్రుడిలా తెల్లగా ఉండే ఉప్పును సైంధవ లవణం అని చెప్పుకోవచ్చు.
2. బిడము
దీన్ని అట్టుప్పు అంటారు. (అట్టు+ఉప్పు). అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం. ఆపూపం అంటే పిండివంట. కాబట్టి పిండివంటల్లో వాడే ఉప్పును బిడము అని చెబుతారు.
3. రుచకము
దీన్ని సౌవర్చల లవణం అని అంటారు. ఇది ఒక దినుసు ఉప్పు అంటుంది శబ్దరత్నాకరం.

షోడశ (16) దానాలు :
1. గోదానం (= ఆవుల దానం)
2. భూదానం, (= భూమి దానం)
3. తిలదానం (=నువ్వుల దానం)
4.హిరణ్యదానం (=బంగారు దానం)
5.రత్నదానం (= రత్నాల దానం)
6.విద్యాదానం (= విద్య దానం)
7.కన్యాదానం (= అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం)
8.దాసీదానం (= దాసీ జనాన్ని దానంగా ఇవ్వడం) (దాసి అంటే డబ్బిచ్చి కొన్న సేవకుడు/సేవకురాలు)
9.శయ్యాదానం (= పడకను దానంగా ఇవ్వడం)
10.గృహదానం (= ఇంటిని దానంగా ఇవ్వడం)
11.అగ్రహారదానం, (= పల్లెటూళ్లను దానంగా ఇవ్వడం)
12.రథదానం (= రథాన్ని దానం)
13.గజదానం (= ఏనుగులను దానం చేయడం)
14.అశ్వదానం, (= గుర్రాలను దానం చేయడం)
15.ఛాగదానం, (= జున్నుపాలు లేదా మజ్జిగ ను దానం చేయడం)
16 మహిషీదానం (= ఎనుము(గేదె)లను దానం ఇవ్వడం)
కృష్ణాష్టమి:
  
                                                          
కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు.

కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.

మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.

అర్ధరాత్రి సమయంలో పుట్టడం వల్ల మానవులలోని అజ్ఞానాన్ని, అష్టమి నవమి తిధులు మంచివి కావు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికి అష్టమి తిథిన కృష్ణునిగా, నవమి తిధిన శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. ఎంతోమంది మహర్షులు, గొప్ప భక్తులు బాలకృష్ణుని లీలలు చూసి ఆనందించారు. అటువంటి బాలకృష్ణుని పై మనకు కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ కర్ణామృతం వంటి స్తోత్రములు ఉన్నాయి. తమిళంలో కూడా పాపనాశం శివన్, సుబ్రహ్మణ్య భారతి ఉడుమలై నారాయణ కవి మొదలైన వారు చాలా గీతాలను రచిచి పిన్నలనుండి పెద్దల వరకు మంత్ర ముగ్ధులను చేశారు.అటువంటి కృష్ణుని ఈరోజు అందరూ ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.


షిరిడీ సాయి:


షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు. అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909లో జరిగింది.

ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం"గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివునిలా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబాకు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ"ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు. ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు. 

పవిత్రమైన శివుని చిహ్నాలు..! :

 నంది ఎద్దు(నంది)శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని ఎద్దు చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు.

త్రిశూలము శివ ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలములో ఉండే 3 వాడి అయిన మొనలు కోరిక,చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి.

నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.

నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగెను. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు.

రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటారు. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' (శివ యొక్క మరొక పేరు) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష్ చెట్టులోకి వెళ్లినాయి.

పాము శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత,వర్తమాన,భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు.

మూడో కన్ను శివుని యొక్క చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది.

డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు.

అట్టకట్టుకొని ఉన్న జుట్టు అట్టకట్టుకొని ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.

  

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము:

                                



అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమాపార్వతి
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సంధాయనీ
వాణి పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియలోలినీ
కల్యాణీ ఉడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాకితా
వీణా వేణు నినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మనీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకటభప్రశమనీ వాణీ రమాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ వై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం యః పఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ


 Astroguide:


August 31
Saturday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana Bahula Dasami till 9.03 am
Star: Ardra till 9.27 pm
Varjaya: Nil
Durmuhurtam: 6.05 am to 7.44 am
Rahukalam: 9 am to 10.30 am
Sunset today: 6.31 pm
Sunrise tomorrow: 6.02 am

Aries
Do not get surprised if you experience a different kind of romantic encounter today. Profits will come through lucrative deals in property, vehicles and different investments.
Taurus
You will enjoy a peaceful and quiet time with family members. Don’t forget to give priority to your social life. Your politeness will bring you lots of praises.
Gemini
A positive attitude will improve relations with others. Financial front will require extra carefulness so avoid wasting hard-earned money.
Cancer
Managing time effectively will be beneficial to you at work. Chances of developing a short-lived romance are high on the cards.
Leo
Your swift action is likely to motivate you, keeping you confident. You will enjoy the company of guests today. You will have some problems with your health if you have been neglecting it lately.
Virgo
Your sharp observation will help you stay ahead of others. It will be difficult for you to control your anger if your colleagues take you for granted. Do things that are good for your career.
Libra
You need to be in touch with people at high positions. As they say that money saved is money earned so you need to save whereever possible. It will benefit you. Be careful while investing.
Scorpio
Join hands with people who are creative and have similar ideas as yours. On career front, think logically in order to solve all your problems.
Sagittarius
This is a good day for many of you. Some married people may get involved in disagreements over the disposition of mutual funds.
Capricorn
With the right company you can bounce back quickly from a gloomy mood. Do not overspend on travel, as financial constraints seems apparent.
Aquarius
You should check on the status of your bank account before you make a major purchase. This is not the time to resolve issues as it may work against you.
Pisces
You will be able to spend some time by yourself today. This is a favourable day for putting more work into your academics. There will be an exciting start to the day. 


శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా:

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా




 కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.

సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.

కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.

ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.




Astroguide:

September 01
Sunday, 2013
Sri Vijaya:  Dakshinayana
Thithi:  Sravana Bahula Ekadasi till 11.24 am
Star:  Punarvasu till 12.24 am on Monday
Varjaya: 10.51 am to 12.38 pm
Durmuhurtam: 4.48 pm to 5.37 pm
Rahukalam: 4.30 pm to 6 pm
Sunset today: 6.30 pm
Sunrise tomorrow: 6.02 am

Aries
Do not get surprised if you experience a different kind of romantic encounter today. Profits will come through lucrative deals in property, vehicles and different investments.
Taurus
You will enjoy a peaceful and quiet time with family members. Don’t forget to give priority to your social life. Your politeness will bring you lots of praises.
Gemini
A positive attitude will improve relations with others. Financial front will require extra carefulness so avoid wasting hard-earned money.
Cancer
Managing time effectively will be beneficial to you at work. Chances of developing a short-lived romance are high on the cards.
Leo
Your swift action is likely to motivate you, keeping you confident. You will enjoy the company of guests today. You will have some problems with your health if you have been neglecting it lately.
Virgo
Your sharp observation will help you stay ahead of others. It will be difficult for you to control your anger if your colleagues take you for granted. Do things that are good for your career.
Libra
You need to be in touch with people at high positions. As they say that money saved is money earned so you need to save whereever possible. It will benefit you. Be careful while investing.
Scorpio
Join hands with people who are creative and have similar ideas as yours. On career front, think logically in order to solve all your problems.
Sagittarius
This is a good day for many of you. Some married people may get involved in disagreements over the disposition of mutual funds.
Capricorn
With the right company you can bounce back quickly from a gloomy mood. Do not overspend on travel, as financial constraints seems apparent.
Aquarius
You should check on the status of your bank account before you make a major purchase. This is not the time to resolve issues as it may work against you.
Pisces
You will be able to spend some time by yourself today. This is a favourable day for putting more work into your academics. There will be an exciting start to the day.



అష్ట దిక్కులు- దిక్పాలకులు:
అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా

తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.

అలాగే నాలుగు మూలలు.

ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం

ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...

దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం

తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం

ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు

దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు

నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు

పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి

వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక

ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం

ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం


రామాయణం యొక్క ఫలశ్రుతి:


 ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.



పన్నెండు తావులు -పన్నెండురూపాలు:
భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. బ్రహ్మదేవుడనగానే నాలుగు ముఖాలతో కమలాసనం మీద కూర్చున మూర్తి కళ్ళకు కడుతుంది. విష్ణువు నాభిలో తామరపువ్వుతో లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి శంఖం, చక్రం, గదమొదలైనవి అయన చిహ్నాలు .

శరీరం నిండా భస్మం అలుదుకొని ఉంటాడు. సర్పాన్నిహారంగా వేసుకుంటాడు. చర్మా౦బరం కట్టుకుంటాడు. ఒక్కోసారి దిగంబరంగాను ఉంటాడు. రుద్రాక్ష మల వేసుకుని ఉంటాడు. కుడిచేతిలో జపమాల ఉంటంది. అయన నంది వాహనుడు .ఇవన్ని శివుడి చిహ్నాలు.

'లిం' అంటే మాములు చూపులకు కనిపించకుండా లోపల ఉన్నదానిని, అంటే 'లీన' మై ఉన్నదానిని 'గం' (గమయంతి ) అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది కనుక అది. 'లింగ ' మై౦దన్నమాట.

పన్నెండు తావులు -పన్నెండురూపాలు

పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు. అన్ని తెలసి ఉంటాడు. అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ ) కనిపిస్తాడు. ఆయనే సాంబమూర్తి .
రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది. దానిని 'ఆరూపం' అంటారు .అదే శివలింగం .
మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు. దాని మొదలు, తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు కూడా భంగపడ్డారు. ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో! అదే శివరాత్రి అయింది. ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవకాలం అంటారు. జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల
తాను వ్యాపించి ఉంటానని, ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు. అవే ద్వాదశజ్యోతిర్లింగాలు.

ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా. ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము, ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.

అయిదు రకాల లింగాలు

శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో
మొదటిది స్వయంభులింగం, అంటే తనంతట తానుగా అవతరించింది .
రెండోవది
బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.
మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.
నాలుగోవది
చరలింగం. దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .
అయిదోవది గురులింగం. శివుని విగ్రహమే గురులింగం.

ఆరు రకాల ద్రవ్యాలు

అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం, దేవశిల్పి అయిన విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు.

అవి: రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు, రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు
చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు, మట్టితో చేసేవి మృత్తికాలింగాలు, అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి
క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు.

ఎవరు ఏ లింగాలని పూజించాలి

లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీల విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల
వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.

ఏలింగాన్ని పూజ ఏ ఫలితం?

ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం, మధ్యమం లోహ లింగం .

అతి పవిత్ర బాణలింగం

అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి .
రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తీకం లో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

స్తావర, జంగమ లింగాలు

జగత్తంతా శివమయం అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి ) జంగమాలు (కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి ) కూడాలింగ రూపాలే అవుతాయి. వీటికి స్తావర లింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా
శివపుజలోకే వస్తుంది .లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.


సప్త ద్వీపాలు:
భూమి పై 7 ద్వీపాలు (అన్ని వైపులా సముద్రం మధ్యలో భూమి కల ప్రాంతాలు) ఉన్నవి. అవి,
జమ్భు
ప్లక్ష
శక
సల్మలి
కుస
క్రౌంచ
పుష్కరాఖ్య

బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు

జంబూద్వీపం - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - మేధాతిథి
శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
శాకద్వీపం - హవ్యుడు
పుష్కరద్వీపం - సేవనుడు.

జంబూద్వీపం
(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి

ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
హరి (అరేబియా) - దక్షిణము
కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
కురు (మంగోలియా) ఉత్తరము
కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
భరత (భారత ఉపఖండము)
ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.

ప్లక్షద్వీపం

ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి.
పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము.
నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత

శాల్మలీద్వీపం

ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష
ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి.
నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.

కుశద్వీపం

ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము
నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ. క్రౌంచద్వీపం
ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.
నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.
దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము

శాకద్వీపం

ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి.
విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము
నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.

పుష్కరద్వీపం

ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర.
నదులు - లేవు.
 














 


 

No comments:

Post a Comment